హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా 92 కోట్ల 74 లక్షల చెక్కును అందజేశారు. జనగామ జిల్లాలోని 1289 SHG సంఘాలకు 100.93 కోట్ల రూపాయల...