మహిళలకు స్వయం ఉపాధి కలిగించే ఉచిత శిక్షణ కేంద్రాలకు మా పూర్తి సహకారాన్ని అందిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ :     మహిళలకు స్వయం ఉపాధి కలిగించే ఉచిత శిక్షణ కేంద్రాలకు మా పూర్తి సహకారాన్ని అందిస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివి గిరిన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యార‌డైజ్‌, నివి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న మ‌హిళ‌ల ఉచిత బ్యూటీష‌న్ శిక్ష‌ణ కేంద్రాన్ని గురువారం కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ సంద‌ర్శించారు. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న మొద‌టి బ్యాచ్ మ‌హిళ‌ల‌తో, శిక్ష‌ణనిచ్చే టీచ‌ర్ ప్ర‌వీణ‌తో...