విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

  హైదరాబాద్, ఏప్రిల్ 15, అద్దం న్యూస్ :    విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాంమ‌ని ఎస్ఎఫ్ఐ మ‌హాస‌భ‌లో నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా 43వ మహాసభలు జ‌రిగాయి. ఈ కార్య‌క్రమా నికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల పైన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకుల బుద్ధి...