Addam News
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 1:39 am Posted by : Addam News

జులై 2 న జరుగనున్న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం

జులై 2 న జరుగనున్న
ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం

హైద‌రాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆధ్వర్యంలో జూలై 2 న జరుగనున్న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆ పార్టీ నాయకులు, ఉద్య‌మ‌కారులు స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో టిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ ఇంచార్జి పరకాల మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల‌ భూ పోరాటానికి సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెరాస జిహెచ్ఎంసి ఇంచార్జి దూగుంట నరేష్ ప్రజాపతి, లువకుమార్, మల్లేష్, ఏలుకొండ రామకోటి, గోపు సదానంద్, కొప్పుల అర్జున్, డేవిడ్, సుధ, సంధ్య తదితర ఉద్యమకారులు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చేంతవరకు మా భూ పోరాటమాగదని హెచ్చరించారు.

టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఇచ్చిన పిలుపుమేరకు భూ పోరాటాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు భరత్ రెడ్డి, మల్లేష్, చంద్ర శేఖర్, అవినాష్, పట్టుగారి సుధా, లవకుమార్, దేశాపాక సుచిత్ర, గడ్డపార జయశ్రీ, సుజాత, నిక్కెల్ సింగ్, గౌతమ్ రెడ్డి, హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల జిహెచ్ఎంసి ఇన్చార్జులు, తెలంగాణ పోరాట సమతి రాష్ట్ర అధ్యక్షులు మల్లూరి అనిల్ కుమార్, సాజిదా సుల్తానా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షుడు రామగిరి ప్రకాష్, బీరకాయల మధుసూదన్, కోప్ప శ్రీనివాస్ గౌడ్, గౌరీ గణేష్, తన్వీర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png