Addam News
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 11:07 pm Posted by : Addam News

భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల పోరాటాల‌ను మ‌రువ‌లేం – తెలంగాణ అడ్వ‌కేట్ జెఎసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

హైదరాబాద్, అద్దం న్యూస్ : భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల పోరాటాల‌ను మ‌రువ‌లేమ‌ని తెలంగాణ అడ్వ‌కేట్ జెఎసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల వ‌ర్థంతుల సంద‌ర్భంగా వారి చిత్ర ప‌టాల‌కు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి త‌దిత‌రులు పూల‌మాల‌లేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా గోవ‌ర్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ… భ‌గ‌త్‌సింగ్‌ పోరాటాల స్ఫూర్తితో దేశ ప్రజలు బ్రిటిష్ నిరంకుశ పాలనను నాడు తరమికొట్టారన్నారు. భారత చరిత్రలో వారి పేర్లు సువర్ణాక్షరాలతో నిలిచాయి, వారు ఎల్లప్పుడూ యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. స్వేచ్ఛా భారతదేశం కోసం వారి పోరాటాన్ని, ప్రాణాలను త్యాగం చేసిన భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లను అంద‌రం గుర్తుంచుకుంటామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు అడ్వ‌కేట్లు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png