భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల పోరాటాలను మరువలేం – తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి
హైదరాబాద్, అద్దం న్యూస్ : భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల పోరాటాలను మరువలేమని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి అన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల వర్థంతుల సందర్భంగా వారి చిత్ర పటాలకు పులిగారి గోవర్థన్‌రెడ్డి తదితరులు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ... భగత్‌సింగ్ పోరాటాల స్ఫూర్తితో దేశ ప్రజలు బ్రిటిష్ నిరంకుశ పాలనను నాడు తరమికొట్టారన్నారు. భారత చరిత్రలో వారి పేర్లు సువర్ణాక్షరాలతో నిలిచాయి, వారు ఎల్లప్పుడూ యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. స్వేచ్ఛా భారతదేశం కోసం...