Addam News
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 1:31 am Posted by : Addam News

బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటాం – టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

                                                 మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

అంబ‌ర్‌పేట్‌, మే 19, అద్దం న్యూస్ :    పాతబస్తీలోని గుల్జార‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను అంబ‌ర్‌పేట్‌ కాంగ్రెస్ నేతలు లేబర్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, పిసిసి కార్యదర్శి లక్ పతి యాదగిరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించడంతో ఓర్వలేక ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పాత‌బ‌స్తీలో జ‌రిగిన అగ్ని ప్రమాదంపై కేటీఆర్ అనవసర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png