తుప్పుపట్టిన విద్యుత్ స్థంభాల స్థానంలో నూతన స్థంభాలను ఏర్పాటు చేయిస్తాం – విద్యుత్ శాఖ ఏడిఈ వినోద్ కుమార్
హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ : తుప్పుపట్టిన విద్యుత్ స్థంభాల స్థానంలో నూతన స్థంభాలను ఏర్పాటు చేయిస్తామని ఆజామాబాద్ డివిజన్ విద్యుత్ శాఖ ఏడిఈ వినోద్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ డివిజన్ భరత్‌నగర్ 1-6-59 నుండి 1-6-85 వరకు ఉన్న విద్యుత్ స్థంభాలు తుప్పుపట్టాయని, వాటిని మరమ్మతులు చేయించాలని కోరుతూ బస్తీ వాసులు ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో...