Addam News
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 7:25 pm Posted by : Addam News

పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాం     – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా చిక్కడపల్లి సంజీవయ్యనగర్ బస్తీలో ఇటీవల రూ. 3.10 లక్షల వ్యయంతో ప్రారంభించిన నూతన మంచినీటి పైప్‌లైన్‌ పనులను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ.. బస్తీలో ఉన్న రెండు వీధుల్లో ఇది వరకే ఒక వీధిలో పైప్‌లైన్‌ పనులు పూర్తి అయ్యాయని, పెండింగ్ లో ఉన్న మరో వీధి పనులకు ప్రత్యేక చర్యలు చేపట్టి జలమండలి అధికారులపై ఒత్తిడి పెంచి మంజూరు చేయించామని కార్పొరేటర్ పావని అన్నారు. స్థానికులకు ఇక మీదట మంచినీటి సరఫరా సమస్యకు దాదాపు శాశ్వత పరిష్కారం చేపట్టామని తెలిపారు. నీటి కొరత ఏర్పడకుండా పనులు పూర్తైన వెంటనే మెరుగైన మంచినీటి సరఫరా ప్రజలకు అందుతుందన్నారు. పనులు ఆలస్యం కాకుండా త్వరగతినా పూర్తి చేసి నీటి సరఫరాను అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, బిజెపి నాయకులు సాయి, శ్రీకాంత్, ఎం.ఉమేష్, మధన్మోహన్, డి.కుమార్, జ్ఞానేశ్వర్, సాయి కుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, నీరజ్, ప్రశాంత్, రాజ్ కుమార్, బస్తీ నాయకులు రమేష్, రాజయ్య, పి.అనిల్, విజయ్, చింటూ, లావణ్య, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png