పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాం     – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా చిక్కడపల్లి సంజీవయ్యనగర్ బస్తీలో ఇటీవల రూ. 3.10 లక్షల వ్యయంతో ప్రారంభించిన నూతన మంచినీటి పైప్‌లైన్‌ పనులను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ.. బస్తీలో ఉన్న రెండు వీధుల్లో ఇది వరకే ఒక వీధిలో పైప్‌లైన్‌ పనులు పూర్తి అయ్యాయని, పెండింగ్...