Addam News
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 5:44 am Posted by : Addam News

రిసాల ఖుర్షీద్ లోని సమస్యలను పరిష్కరిస్తాం – ఎంఎల్ఏ ముఠా గోపాల్

హైదరాబాద్, అద్దం న్యూస్ : రిసాల ఖుర్షీద్ లోని సమస్యలను పరిష్కరిస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎంఎల్ఏ ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ రిసాల ఖుర్షీద్ లో సమస్య పై స్థానికుల ఫిర్యాదు మేరకు జిహెచ్ఎంసి జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్డు గోల్కొండ చౌరస్తా నుండి రిసాల ఖుర్షీద్ మజీద్ వరకు రోడ్డు, ముస్లిం స్మశానంలో స్ట్రీట్ లైట్స్ కొరకు. మెస్పా చర్చి లైన్, అంబేద్కర్ నగర్ పలు ప్రాంతాలలో డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ వేయాలని, సీసీ రోడ్డు వేయాలని, అలాగే వీధి లైట్స్ కూడా రావడంలేదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తిసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మోహన్ రాజ్. మేనేజర్ శివసాయి. సూపర్ వైజర్ గౌస్, జిహెచ్ఎంసి డిఈ గీత, ఏఈ మురళి, ఇతర సిబ్బందితో పాటు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, ముక్తార్ హుస్సేన్, ఇలాం హుస్సేన్, ముదిగొండ మురళి. ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png