Addam News
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 5:14 pm Posted by : Addam News

వివి గిరి నగర్ బస్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : వివి గిరి నగర్ బస్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ వివి గిరిన‌గ‌ర్ బ‌స్తీవాసులు ఆదివారం కార్పొరేటర్ కార్యాలయంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వివి గిరి నగర్‌లో నిర్మించిన నూతన కమ్యూనిటీహాల్ భవనం పై మరో అంతస్తు నిర్మించి, బ‌స్తీలోని యువతకు ఉపయోగకరంగా ఉండేందుకు “జిమ్” ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ పావ‌ని ని కోరారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… బస్తీల్లో కమ్యూనిటీహాల్ భవనాలు నిర్మించేది స్థానికులకు ఉపయోగకరంగా ఉండేందుకే అని అన్నారు. బ‌స్తీ యువకులు, బ‌స్తీ అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు “జిమ్” ఏర్పాటుకు తప్పకుండా కృషి చేస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బ‌స్తీవాసులు శ్రీనివాస్, కుమార్, సాయి కుమార్, రాజేష్, సాయి తరుణ్, భారత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png