వివి గిరి నగర్ బస్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : వివి గిరి నగర్ బస్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ వివి గిరిన‌గ‌ర్ బ‌స్తీవాసులు ఆదివారం కార్పొరేటర్ కార్యాలయంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వివి గిరి నగర్‌లో నిర్మించిన నూతన కమ్యూనిటీహాల్ భవనం పై మరో అంతస్తు నిర్మించి, బ‌స్తీలోని యువతకు ఉపయోగకరంగా ఉండేందుకు "జిమ్" ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ పావ‌ని ని కోరారు....