Addam News
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 3:32 pm Posted by : Addam News

తెలంగాణ‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ బలోపేతం చేస్తాం

తెలంగాణ‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ బలోపేతం చేస్తాం
– రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్య‌క్షుడు బైగ‌ల్ల నాగేశ్వ‌ర‌రావు

హైద‌రాబాద్‌, జూలై 3, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ బలోపేతం చేస్తామ‌ని రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా ( ఆర్‌పిఐ ) జాతీయ ఉపాధ్య‌క్షుడు బైగ‌ల్ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బైగ‌ల్లా నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ… రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ( అథవాలే ) జాతీయ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే ఆదేశాల మేరకు తెలంగాణలోని హైదరాబాద్ లక్డీకాపుల్‌లో గల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తాను జాతీయ ఉపాధ్య‌క్షుడిగా, జాతీయ ఆర్గ‌నైజింగ్ సెక్ర‌టరీగా, రాష్ట్ర ప‌రిశీల‌కులుగా కొంపెల్లి ప్ర‌భుదాస్‌ను, దక్షిణ భారత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఐరేని శ్ర‌వణ్‌కుమార్‌ను, దక్షిణ భారత జనరల్ సెక్రటరీగా గొల్లపల్లి నాగరాజు ను, రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌సుల ర‌వి కుమార్‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ తాత్కాలిక క‌మిటీని ఏక‌గ్రీవంగా ఆమోదించి జాతీయ అధ్య‌క్షుడు రామ్‌దాస్ అథ‌వాలేకు పంప‌డం జ‌రిగింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆప్ ఇండియా ను మ‌రింత ప‌టిష్టం చేసేందుకే ఈ క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆప్ ఇండియా పార్టీ పోటీ చేస్తుంద‌ని నాగేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ కోర్ క‌మిటీ స‌మావేశంలో జాతీయ ఆర్గ‌నైజేష‌న్ సెక్ర‌ట‌రి కొంపెల్లి ప్ర‌భుదాస్‌, సౌత్ ఇండియా వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ ఐరేని శ్ర‌వ‌ణ్ కుమార్‌, రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌సుల ర‌వి కుమార్‌, రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు శివ‌రాజ్‌, రాష్ట్ర మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు స‌రిగొమ్మ‌ల స్నేహ‌ల‌త‌, ర‌త్న ప్ర‌సాద్‌, ఉపాధ్య‌క్షుడు తుంగ‌పింది ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png