శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీ వాసులకు ఇళ్లను కేటాయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం – రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్టర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ :       శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు అతి త్వరలో ఇళ్లను కేటాయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఓబిసి మోర్చ జాతీయ అధ్య‌క్షుడు డాక్టర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ శ్రీ స్వామి వివేకానంద‌న‌గ‌ర్ బ‌స్తీలోని 19 పేద ద‌ళిత కుటుంబాల ఇళ్ల‌ను కూల్చివేసి 15 నెల‌లు కావొస్తున్నా త‌మ‌కు పున‌రావాసం క‌ల్పించ‌డంలేద‌ని, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను కేటాయిస్తామ‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వ అధికారులు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని...