Addam News
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 3:57 pm Posted by : Addam News

ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ జవహర్‌న‌గ‌ర్ కవేలి గ్రౌడ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో పాఠశాల పేరుతో ఉన్న బోర్డును గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… నీవి చారిటబుల్ స్వ‌చ్ఛంద‌ సంస్థ ద్వారా డివిజన్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు, స్కూల్ నేమ్ బోర్డు ఏర్పాటు చేశామని కార్పొరేటర్ పావ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ దేవదాస్, టీచర్లు సౌజన్య, మెరిబా, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, ఆకుల సురేందర్, ఆనంద్ రావు, సాయి కుమార్, స్థానికుడు సాయిలు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png