ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తాం – రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేష‌న్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం అని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. శనివారం హైద‌రాబాద్‌లోని బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక ఫిషర్మెన్ సొసైటీల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ కుమార్ రజక అధ్యక్షతన రజకుల జన శంఖారావం – రజకుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, రజక ఫెడరేషన్ రాష్ట్ర సొసైటీల కమిటీ...