Addam News
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 3:10 am Posted by : Addam News

బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని

బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తాం
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని

హైదరాబాద్, డిసెంబ‌ర్ 3, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని శాంతి యువ‌జ‌న సంఘం బ‌స్తీలోని స్థానికుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఖాళీ స్థలంలో బ‌స్తీ ద‌వాఖాన భ‌వ‌నం ఏర్పాటు కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని అన్నారు. బుధ‌వారం బస్తీ వాసులు కార్పొరేటర్ పావ‌నికి బస్తీ దవాఖాన భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… సంబంధిత జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో చర్చించి, బస్తీ నాయకులు, స్థానికుల కోరిక మేరకు బస్తీ దవాఖాన భవనం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయ‌కులు సాయి కుమార్, నీరజ్, తరుణ్, జ్ఞానేశ్వర్, బస్తీ నాయకులు ఈద సాయి, ఎస్.రాజు, పెంటయ్య, గణేష్, వేణు, శివ కుమార్, హరినాథ్, నూరుద్దీన్, షాబుద్దిన్, మురళీ, స్థానికులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png