Addam News
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 1:36 pm Posted by : Addam News

మంచినీటి సరఫరా చేయరా ? – వాటర్ వర్క్స్ డీజీఎం ను నిలదీసిన బిజెపి నాయకుడు వినయ్

మంచినీటి సరఫరా చేయరా ?
– వాటర్ వర్క్స్ డీజీఎం ను నిలదీసిన బిజెపి నాయకుడు వినయ్

హైద‌రాబాద్‌, జూన్ 9, ( అద్దం న్యూస్ ) :  గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అరుంధతినగర్, సబర్మతి నగర్ తదితర బస్తీలో గత నాలుగు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని, నీటి సరఫరా చేస్తారా.. చేయరా అని దోమలగూడ వాటర్ వర్క్స్ డీజీఎం వెంకట్ రెడ్డిని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ నిలదీశారు. డివిజన్ పరిధిలోని అరుంధతినగర్, సబర్మతి నగర్ బస్తీల్లో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా రావడంలేదని బ‌స్తీవాసులు స్థానిక మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి అధికారుల‌కు ఫిర్యాదు చేసి, ఆమె సూచనల మేరకు మంగళవారం దోమలగూడ వాటర్ వర్క్స్ డీజిఎం వెంకట్ రెడ్డిని బస్తీ వాసులతో కలిసి వినయ్ కుమార్ మాట్లాడారు. వినయ్ కుమార్ డిజిఎం ను కలిసి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఆ బస్తీల్లో మంచినీటి సరఫరా చేయడం లేదని వినయ్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు సురక్షిత మంచినీటిని అందజేయడంలో వాటర్ వర్క్స్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికే రంగు నీళ్లు, కలుషిత నీటి సరఫరాతో అనారోగ్యం పాలై, ఆందోళన చెందిన డివిజన్ ప్రజలకు ఇప్పుడు నీటి సరఫరా నిలిపివేయడం వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. వెంటనే మంచినీటి సరఫరా అందించకపోతే డివిజన్ ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వినయ్ కుమార్ హెచ్చరించారు. ఇందుకు వాటర్ వర్క్స్ బిజిఎం వెంకటరెడ్డి స్పందించారని, ముఖ్యమైన పైపులైన్ల మరమ్మతుల కారణంగా సరఫరా నిలిచిపోయిందని రేపటికల్లా పనులు పూర్తిచేసి మంచినీటిని అందజేస్తామని హామీ ఇచ్చారని వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, బస్తీ వాసులు లక్ష్మయ్య, రాము, యాదగిరి, ధనరాజ్, రవిచంద్ర, శ్రీను, ప్రశాంత్, మహిళలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png