నీటి పొదుపుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి – సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
కూకట్పల్లి, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) : నీటి పొదుపు, పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో కూకట్పల్లి పరిధిలో జల సంరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ సేవ్ వాటర్ – రీయూజ్ వాటర్ ’ ప్రచార పోస్టర్లను విడుదల చేసి, క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు లైన్మెన్లకు అనౌన్స్మెంట్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్...