హెచ్‌సియులో ఇంత గొడవ జరుగుతుంటే హైడ్రా నిద్ర పోతుందా – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుదాకర్ డిమాండ్

  హైదరాబాద్, అద్దం న్యూస్ : హెచ్‌సియులో ఇంత గొడవ జరుగుతుంటే హైడ్రా నిద్ర పోతుందా ...? అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుదాకర్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. హెచ్‌సియు సమస్య పై అఖిలపక్ష పార్టీలతో, విద్యార్ధి సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా సెంట్రల్ యునివర్సిటీ కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు కబ్జా కు గురి అవుతుంటే రాష్ట్రంలో చెరువులు కాపాడుతానని ప్రతిజ్ఞ బూనిన హైడ్రా రంగనాద్...