మారేడ్‌ప‌ల్లి జూనియర్ టెక్నికల్ హై స్కూల్ ఇక కనుమరుగు కానుందా !

ఎందరో సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దిన మారేడ్‌ప‌ల్లి జూనియర్ టెక్నికల్ హై స్కూల్ ఇక కనుమరుగు కానుందా ! స్వాతంత్య్ర అనంతరం హైస్కూల్ విద్య పూర్తయిన వెంటనే బలమైన సాంకేతిక శ్రామిక శక్తిని నిర్మించడానికి ముదలియార్ కమిషన్ ( 1952–53 నాటి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ) సెకండరీ విద్యలో వైవిధ్యీకరణను బలంగా సమర్థించింది. దీని ఫలితంగా భారతదేశం అంతటా బహుళార్ధసాధక ఉన్నత పాఠశాలలు, జూనియర్ టెక్నికల్ ఉన్నత పాఠశాలల భావన ఆవిర్భవించింది. ఆచరణాత్మక వృత్తి విద్యను సులభతరం చేయడానికి సాంకేతిక సంస్థలు, జూనియర్ టెక్నికల్...