జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, జూన్ 18, అద్దం న్యూస్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగిత్యాల శాసన సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులలంతా ఐక్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా ప్రయత్నం చేయాలని అన్నారు. బుధవారం జగిత్యాలలో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) జగిత్యాల జిల్లా తృతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు సంజయ్...