Addam News
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:30 am Posted by : Addam News

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో
శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర
» హాజ‌రైన మంత్రులు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 9, ( అద్దం న్యూస్ ) :    ఆషాడ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాత‌ర ఆదివారం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, సుగంధ భరిత పుష్పాలంకరణ, బాల భోగము, అమ్మవారి దివ్య దర్శనం జ‌రిగింది. అమ్మవారికి నిషి పూజ బలిహరణ ద్వార బంధనం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ బోనాల ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర్సింహా, శ్రీధ‌ర్‌బాబు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌, ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌, మాజీ ఎమ్మెల్యే కోదండ‌రెడ్డి, మాజీ సీఎం టి.అంజ‌య్య మ‌న‌వడు అభిషేక్‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని పూజ‌లు చేశారు.

అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తులు పెద్ద ఎత్తున బోనాలను తీసుకొని వ‌చ్చి అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహ‌ణాధికారి పి.మహేందర్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకుడు సాత్విక్ శర్మ, ఆల‌య సిబ్బంది సతీష్ కుమార్, అర్చ‌కులు, సిబ్బంది రాజేష్ శర్మ, రాంబాబు శర్మ, లక్ష్మీ నరసింహ రెడ్డి, కాంగ్రెస్‌, బిఆర్ఎస్, బిజెపి నాయ‌కులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png