చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్ పరిధిలో మ‌హిళ దారుణ హత్య

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్ పరిధిలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లిలోని మాచర్ల జ్యువెలరీ షాప్ సమీపంలో ఆదివారం ఉద‌యం సుమారు 11:22 గంటల సమయంలో ఓ మ‌హిళ మృత‌దేహం ర‌క్తంతో ప‌డి ఉండ‌టాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అంద‌చేశారు. విష‌యం తెలుసుకున్న చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే తేజస్వి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నరేందర్...