మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు
మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : దేశవాళీ క్రికెట్లో మహిళా క్రికెటర్లు, మ్యాచ్ అధికారుల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ రెట్టింపుకన్నా ఎక్కువ పెంచింది. దీంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అమ్మాయిల ఆర్థిక స్థిరత్వం పెరగనుంది. భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పెంపుదలను బోర్డు అపెక్స్ కౌన్సిల్ ధ్రువీకరించింది. సవరించిన చెల్లింపు విధానం ప్రకారం.. సీనియర్ మహిళల దేశవాళీ వన్డే టోర్నమెంట్, బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో...