Addam News
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 5:43 am Posted by : Addam News

మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంతో 10 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యాణ చార్జీల‌ను ఆదా చేసుకున్న మ‌హిళ‌లు

మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంతో 10 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యాణ చార్జీల‌ను ఆదా చేసుకున్న మ‌హిళ‌లు

హైదరాబాద్, మార్చి 31, అద్దం న్యూస్ :   రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంతో 10 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యాణ చార్జీల‌ను మ‌హిళ‌లు ఆదా చేసుకున్నార‌ని కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లోక పావని, ముషీరాబాద్ ఆర్టీసి డిపో మేనేజ‌ర్ టి.రఘు లు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 290 కోట్ల ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం వినియోగించిన 10,000 కోట్ల రూపాయల ఛార్జీలను ఆదా చేసినందుకుగాను ముషీరాబాద్ డిపో ఆధ్వ‌ర్యంలో కోఠిలోని క‌మ్యూట‌ర్ ఎమినిటీ సెంట‌ర్ ( సిఏసి ) లో మంగ‌ళ‌వారం స‌మావేశం జ‌రిగింది. ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మ‌హిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లోక పావని హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… గ‌డిచిన రెండేళ్ల‌ల్లో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌లు 290 కోట్లు ఉచితంగా ప్ర‌యాణించార‌న్నారు. దీని ద్వారా 10 వేల కోట్ల రూపాయ‌ల చార్జీల‌ను మ‌హిళలు ఆదా చేసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇది చాలా గొప్ప విష‌య‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌లు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png