Addam News
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 5:05 am Posted by : Addam News

ముషీరాబాద్ డిపోలో కార్మికుల దినోత్సవం

ముషీరాబాద్ డిపోలో కార్మికుల దినోత్సవం

హైదరాబాద్, మే 1, ( అద్దం న్యూస్ ) :  ముషీరాబాద్ డిపోలో కార్మికుల దినోత్సవం వేడుక‌లు శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌రై ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘుతో క‌లిసి కార్మికుల‌కు స్వీట్లను అంద‌చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ… కార్మికుల కృషి దేశ అభివృద్ధికి మూలస్థంభమన్నారు. కార్మికుల సేవలను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముషీరాబాద్ డిపో కార్మికులు, మాజీ కార్పొరేట‌ర్ క‌ల్ప‌న యాద‌వ్‌, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్‌, పార్టీ నాయ‌కులు పాశం అనిల్ కుమార్ యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png