నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అమ్మ‌వారికి పూజ‌లు

నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అమ్మ‌వారికి పూజ‌లు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు హైద‌రాబాద్‌లో సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ 28 వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మండ‌పంలో అమ్మ‌వారికి తొలి రోజు సోమ‌వారం పూజ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని శ్రీ బాలా త్రిపుర‌సుంద‌రీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు...