భవాని శంకర దేవాలయంలో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు
శ్రీ భవాని శంకర దేవాలయంలో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు ముషీరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో అమ్మవారిని సోమవారం శ్రీ సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సురేష్ కుమార్, ఆలయ సిబ్బంది మిక్కిలినేని సురేష్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.