Addam News
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 4:11 am Posted by : Addam News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వినాయ‌కుడికి పూజ‌లు

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వినాయ‌కుడికి పూజ‌లు

హైదరాబాద్, ఆగ‌స్టు 28, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ఆర్‌టిసి క్రాస్ రోడ్ ద‌గ్గ‌ర‌లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వినాయ‌క న‌వ‌రాత్రుల‌ వేడుకల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ లక్ష్మా రెడ్డి, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ మారిశెట్టి నర్సింగ్ రావు, అర్చకులచే స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేతలు శ్రీకాంత్, శివ కుమార్, శేషికాంత్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png