కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ చేపట్టాలని సిబిఐకి లేఖ రాయండి
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ నిపుణుల సూచనల మేరకు విచారణ చేపట్టాలని సిబిఐకి లేఖ రాయండి – అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కోసం న్యాయ నిపుణుల సూచనల మేరకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. అవసరమైతే ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని నేరుగా వినతిపత్రం అందించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల హైకోర్టు తీర్పు...