ముషీరాబాద్ డిపో ఆధ్వ‌ర్యంలో బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా యాత్రా దానం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 14, అద్దం న్యూస్ :      టిజిఎస్ ఆర్టీసి ప్ర‌వేశ‌పెట్టిన యాత్రా దానం కార్య‌క్ర‌మంలో భాగంగా బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా కెడిఆర్ చారిటబుల్ ట్ర‌స్ట్ ( నాగ‌ర్ క‌ర్నూల్ ) వారు కె.ద‌క్షిణా మూర్తి జ్ఞాప‌కార్థం ముషీరాబాద్ ఆర్టీసి డిపో స‌హ‌కారంతో యాత్రా దానానికి త‌ర‌లివెళ్లారు. ఇందులో భాగంగా అమితాభి ఆద‌ర‌ణ విద్యాల‌య విద్యార్థుల‌ను శుక్ర‌వారం హైద‌రాబాద్ నుంచి స్వ‌ర్ణ‌గిరి దేవాల‌యం సంద‌ర్శ‌న‌కు తీసుకొని వెళ్లారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు హాజ‌రై యాత్ర‌ను...