నేడు చిక్కడపల్లిలోని బ్రహ్మకుమారీస్ శాఖలో యోగా దినోత్సవం
హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ : ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి బ్రహ్మకుమారీస్ శాఖలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని బ్రహ్మకుమారీస్ జయశ్రీ, ప్రసాద్, వైశాలి లు తెలిపారు. ఈ యోగా దినోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, బ్రహ్మకుమారీస్ జయశ్రీ, ప్రసాద్, వైశాలి లు మాట్లాడుతూ... పెద్ద సంఖ్యలో యోగాలో పాల్గొని శారీరక మానసిక ఆరోగ్యం మెరుగు...