గాంధీనగర్ డివిజన్‌లో యోగా కార్య‌క్ర‌మం

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ :     అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ జవహర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ ప్రాంగణంలో బుధ‌వారం యోగా కార్య‌క్ర‌మం జ‌రిగింది. బిజెపి గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు న‌వీన్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ నాయకులతో కలిసి యోగ ఆసనాలు వేశారు. యోగ మాస్టర్ డివైన్ పవర్ యోగా సెంటర్ స్థాపకులు ఎన్.దీనన్ శిక్షణలో నాయకులు యోగ చేశారు....