కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన యువతిని సుష్మ (27)గా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్లితే... సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన అంజయ్య కూతురు సుష్మ ( 27 ) బుధవారం హైటెక్ సిటీలోని (DIEBOLD/NIXDORF) కార్యాలయానికి పని నిమిత్తం వెళ్లింది. రాత్రి అయినా సుష్మ...