గాంధీనగర్, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బుధవారం పలు అమ్మవారి మండపాలను తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ టిఆర్టి గ్రౌండ్ అమ్మవారి మండపం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరై భక్తులకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా మండపంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శ మారిశెట్టి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ యాదవ్, సురేందర్, నరేందర్ యాదవ్, జగదీష్ బాబు, గడ్డం రాజేష్, గుర్రం శంకర్, నవీన్, బంటారం యాదిగిరి గౌడ్, ప్రవీణ్, సాయి రామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ![]()