Addam News
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 9:40 pm Posted by : Addam News

యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి – సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఆర్ఎస్ ఎన్.బలరామ్

 

యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి

– సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్
కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఆర్ఎస్ ఎన్.బలరామ్
కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఆర్ఎస్ ఎన్.బలరామ్

అంబ‌ర్‌పేట్‌, మే 12, అద్దం న్యూస్ :   యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఆర్ఎస్ ఎన్.బలరామ్ అన్నారు. అంబ‌ర్‌పేట్‌లో సిమ్ స‌న్ ఫార్మా లిమిటెడ్‌, నోబెల్ ఎడ్యుకేష‌న్ ఎంపవర్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో యువతకు ఉచిత నైపుణ్య ఉద్యోగ కల్పన కేంద్రం ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలరామ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకున్నప్పుడే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. సిమ్సన్ ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.పి.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. యువత కోసం ఉచిత వ్యక్తిత్వ వికాస ఉపాధి కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png