యువత సొంతంగా వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి పథంలో పయనించాలి – ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌

కాచిగూడ, న‌వంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా యువతి, యువకులు సొంతంగా వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి పథంలో పయనించాలని అంబర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. వాఫిల్ బ్రాండ్ ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వేస్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డీ–వాఫిల్ కేఫ్ 7వ బ్రాంచ్ ఫుడ్ కోర్టును బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... వ్యాపారాభివృద్దికి వినియోగదారుల నమ్మకమే పెట్టుబడి అని, దానికి అనుగుణంగా వినియోగదారుల మన్నన‌లను పొందాలని సూచించారు....