యువ‌త డ్ర‌గ్స్‌కు దూరంగా ఉండి క్రీడ‌లు, వ్యాయామం, సైక్లింగ్‌ల‌ను అల‌వాటు చేసుకోవాలి – రాజ్యసభ స‌భ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్

హైద‌రాబాద్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :     యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవాలని రాజ్యసభ స‌భ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా, యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు హైద‌రాబాద్‌ ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలో అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నశాముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ జ‌రిగింది. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ సమీపంలో ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ దాదాపు 8 కిలోమీటర్లు...