Addam News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:59 am Posted by : Addam News

గణేష్ మండపాలకు వెళ్లిన యువకుడు అదృశ్యం

కాచిగూడ, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) :        గణేష్ మండపాలకు వెళ్లిన యువకుడు ఆదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేష‌న్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్ట‌ర్‌ ఎస్.రాజశేఖర్ వివరాల ప్రకారం వివ‌రాలిలా ఉన్నాయి… హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం తిల‌క్‌న‌గ‌ర్‌లోని శివాలయం ప్రాంతానికి చెందిన రవి కొడుకు జి.నందవర్ధన్ ( 22 ) ఈ నెల 18 వ తేదీన కుటుంబ సభ్యులకు చెప్పకుండా గణేష్‌ మండపాలకు వెలుతున్నానని వెళ్లి ఎంత సేప‌టికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కలత చెందిన తండ్రి రవి స్నేహితులు, బంధువులు, ఇతర ప్రాంతాల్లో వెతికిన ఆచూకి లభించకపోవడంతో కాచిగూడ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. నందవర్ధన్ వంకయ రంగు చొక్కా, క్రీమ్ రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.7 ఉన్నట్లు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్సై పవన్ కుమార్‌ తెలిపారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png