గణేష్ మండపాలకు వెళ్లిన యువకుడు అదృశ్యం

కాచిగూడ, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) :        గణేష్ మండపాలకు వెళ్లిన యువకుడు ఆదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేష‌న్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్ట‌ర్‌ ఎస్.రాజశేఖర్ వివరాల ప్రకారం వివ‌రాలిలా ఉన్నాయి... హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం తిల‌క్‌న‌గ‌ర్‌లోని శివాలయం ప్రాంతానికి చెందిన రవి కొడుకు జి.నందవర్ధన్ ( 22 ) ఈ నెల 18 వ తేదీన కుటుంబ సభ్యులకు చెప్పకుండా గణేష్‌ మండపాలకు వెలుతున్నానని వెళ్లి ఎంత సేప‌టికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కలత చెందిన తండ్రి...