Friday, September 18, 2026
HomeGREATER HYDERABADప్రజా పాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

 హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రజా పాలన యొక్క ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు, ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని వారు తెలిపారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మోతే శోభన్ రెడ్డి, మోతే శ్రీలత శోభన్ రెడ్డి పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page