Friday, September 18, 2026
HomeGREATER HYDERABADరంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగ‌ణంలో విశ్వ‌క‌ర్మ జ‌యంతి వేడుక‌లు

రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగ‌ణంలో విశ్వ‌క‌ర్మ జ‌యంతి వేడుక‌లు

రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగ‌ణంలో గురువారం శ్రీ శ్రీ శ్రీ విశ్వ‌క‌ర్మ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ ట్ర‌బ్యున‌ల్ మాజీ స‌భ్యుడు, తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హాజ‌రై విశ్వ‌క‌ర్మ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేశారు. ఈ సంద‌ర్భంగా పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ… హిందూ పురాణాల ప్రకారం, విశ్వకర్మ భగవానుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని, జగత్తును తీర్చిదిద్దిన తొలి శిల్పి, ఇంజనీర్ అని అన్నారు. దేవశిల్పి, సృష్టికర్త అయిన శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవానుని జయంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. నేడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, ఆ వెనుక ఉన్న సృజనాత్మకతకు మూలం విశ్వకర్మ తత్వమే అని పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page