ఆరె కటికలకు వైన్స్‌ల్లో 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.క్రిష్ణ‌య్య‌, ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు భూంపల్లి అశోక్ దాదా 

ఆరె కటికలకు వైన్స్‌ల్లో 30 శాతం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రిజర్వేషన్ ఇవ్వాలి

– రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.క్రిష్ణ‌య్య‌

ద‌స‌రా లోపు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించక‌పోతే ఆమ‌ర‌ణ దీక్ష చేస్తా

– ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 19, అద్దం న్యూస్ :     మా ఓట్లు కావాలంటే ఆరె కటికలకు వైన్స్‌ల్లో 30 శాతం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.క్రిష్ణ‌య్య‌, ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో హైద‌రాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్‌లో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.క్రిష్ణ‌య్య‌ మాట్లాడుతూ… ప్రభుత్వం ఆరెకటికలకు వైన్స్ టెండర్లలో 30% రిజర్వేషన్ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు సాంప్ర‌దాయ‌ప‌ద్ద‌తిలో సారాయిని త‌యారు చేసే వృత్తి ఆరె క‌టిక‌ల‌ద‌న్నారు. ఇత‌ర కులాల‌తో పోటీ ప‌డ‌లేక ఆరె క‌టిక‌లు ఉద్యోగాలు రావ‌డంలేద‌ని, ఐఐటి సీట్ల‌ల్లో అవ‌కాశాల‌ను కోల్ప‌తున్నార‌న్నారు. ఆరె క‌టిక‌ల‌ను బిసి డి నుంచి బిసి ఎ లోకి చేర్చాల‌ని డిమాండ్ చేశారు. మ‌ట‌న్ షాపుల‌ను మోడ్ర‌న్ స్థాయిలో పెట్టి ఆరె క‌టిక‌ల‌కు అప్ప‌గించాల‌న్నారు. మేక‌ల మండీల నిర్వ‌హ‌ణ‌ను ఆరె క‌టిక‌ల‌కు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. మేక‌లు, గొర్రెల పెంప‌కానికి స‌ప్సిడి ద్వారా డబ్బులు ఇచ్చి ఆరె క‌టిక‌ల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిద‌న్నారు. ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా మాట్లాడుతూ… సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెద్ద మ‌న‌సుతో వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం ఇస్తార‌ని ఆశిస్తున్నామ‌న్నారు. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఇప్ప పూలతో సారాయి త‌యారు చేసి నేటి వ‌ర‌కు నాటు సారా వ‌ర‌కు ఆరె క‌టిక‌లదే వృత్తి అని అన్నారు. వైన్స్ టెండ‌ర్ల‌ల్లో శాతాల‌ను ప్ర‌కటించి రిజ‌ర్వేష‌న్ ను ప్ర‌క‌టించి గెజిట్‌ను విడుద‌ల చేసిన ప్ర‌భుత్వానికి ఆరె క‌టిక‌లు క‌న‌ప‌డ‌లేదా అని అన్నారు. వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల క‌డుపు కొట్ట‌వ‌ద్ద‌న్నారు. మ‌ట‌న్ వృత్తిలో ఇత‌ర కులాలు వారు ప్ర‌వేశం చేసిన నేప‌ధ్యంలో ఉపాధి లేక ఆరె క‌టిక‌లు చాలా మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌న్నారు.

ద‌స‌రాలోపు ఆరె క‌టిక‌ల‌కు వైన్స్ టెండ‌ర్ల‌ల్లో 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించ‌క‌పోతే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ను చేస్తాన‌ని అశోక్ దాదా అన్నారు. నిరాహార దీక్ష‌లు, అహింస‌మార్గాల్లోనే భార‌త స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అదే విధంగా తాను ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసైన వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను సాధిస్తాన‌న్నారు. ఈ స‌మావేశంలో ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి నందీశ్వర్, ఉపాధ్య‌క్షుడు ఎం.నాగ శేషు, కోశాధికారి వెంకటేశ్వర్ రెడ్డి, కెడి.దినేష్‌, న‌రేంద‌ర్‌, శివ ప్ర‌సాద్‌, ర‌మేష్‌, శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page