పేదల సహాయానికి నిత్యం సంసిద్దం – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

పేదల సహాయానికి నిత్యం సంసిద్దం
– సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, సెప్టెంబ‌ర్ 12, ( అద్దం న్యూస్ ) :    పేద ప్రజలకు వైద్య సేవలను అందించే ప్రక్రియకే అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తామని, అందుబాటులో నిలుపుతామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం సీతాఫలమండీలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మారావు గౌడ్ 42 మందికి సుమారు రూ. 18 లక్షల విలువ చేసే చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యం నిరుపేదలకు ఆర్ధిక భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను ఆదుకొనేందుకు తమ వంతు కృషి చేస్తామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page