మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి
– నల్లకుంట పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్
అంబర్పేట్, సెప్టెంబర్ 12, ( అద్దం న్యూస్ ) : వినాయక చవితి పండుగను, భక్తి శ్రద్దలతో, సంప్రదాయాలతో, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకుందామని నల్లకుంట పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ పిలుపునిచ్చారు. నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ), హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( HCF ) సంయుక్తాధ్వర్యంంలో శనివారం నల్లకుంటలో జరిగిన మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లకుంట పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక ప్రతిమలను అందచేశారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్‌సాగర్, చెరువులు, కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం అని అన్నారు. మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో వైభవంగా నిర్వహించుకొనే “ వినాయక చవితి ” పండుగ సందర్భంగా అందరూ ఇండ్లలోనూ, అపార్ట్మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను.. మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, పి.శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, రామకృష్ణారావు, రాజీవ్ కుమార్, డాక్టర్ అమర్నాథ్, సత్యనారాయణ, కృష్ణ బాబు, కిరణ్, గోపాల్, శివకుమార్, వినోద్, సుకుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply