రిటైర్డ్ చీఫ్ న‌ర్సింగ్ సూపరింటెండెంట్ బోజ‌న‌ప‌ల్లి విజ‌య‌కు స‌న్మానం

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :   గోదావ‌రిఖ‌ని ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో చీఫ్ న‌ర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్‌-1 గా విధుల‌ను నిర్వ‌ర్తించి రిటైర్డ్ అయిన బోజ‌న‌ప‌ల్లి విజ‌య గంగ‌పుత్ర‌కు స‌న్మానం జ‌రిగింది. బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు మదేశి రాజేంద‌ర్‌, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిసి సంక్షేమ సంఘం అధ్య‌క్షురాలు మ‌దేశి క‌ళావ‌తి ల ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం బోజ‌న‌ప‌ల్లి విజ‌య‌కు స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స‌రోజ దంప‌తులు విజ‌య‌కు శాలువాలు క‌ప్పి, జ్ఞాపిక‌ల‌ను అంద‌చేసి ఘనంగా స‌త్క‌రించారు. 39 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డంతో పాటు క‌రోనా స‌మ‌యంలో కూడా ప్ర‌జ‌లంద‌రికి వ్యాక్సిన్లు అంద‌చేసి విజ‌య త‌న వృత్తికి న్యాయం చేశార‌ని ఎమ్మెల్యే గోపాల్ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రసకట్ల పుష్పలీలా, మదేశి శంకరమ్మ, అటీకేటి రాజేష్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Exit mobile version