హైదరాబాద్, నవంబర్ 15, అద్దం న్యూస్ : సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం శనివారం హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, డిఐ నదీమ్, చిక్కడపల్లి డిఐ శంకర్, ఎస్ఐ కరీమ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ క్రైమ్ పైన క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఎలాంటి ఓటీపీలు కానీ, ఆన్‌లైన్ చాటింగ్ కానీ విద్యార్థుల ఫొటోస్ గానీ మార్పింగ్ విషయంలో ఏ విధంగా జరుగుతది అనే విషయం పైన పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో సైబర్ క్రైమ్ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఉద్యోగస్తులు, 300 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply
Cancel reply