శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న
బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
హైదరాబాద్, మే 12, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్‌కు ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం ఈఓ మాచర్ల దేవనాధం, ఆలయ పునర్నిర్మాణం కమిటీ చైర్మన్ జానకి సుధాకర్, బిజెపి నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రావు, మధు గౌడ్, బాపూనగర్ ఆలయ కమిటీ సభ్యులు శంకర్ గౌడ్, శివ శంకర్, ప్రవీణ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply